ఒమన్ అంతర్జాతీయ ఆసుపత్రి ప్రారంభం
- January 07, 2022
మస్కట్: ఒమన్ అంతర్జాతీయ ఆసుపత్రి అధికారికంగా సేవలు అందించేందుకు సిద్ధమయ్యింది. పౌరులు, నివాసితులకు మెరుగైన సేవల్ని అందించే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. ఒమన్ ఇన్వెస్టిమెంట్ అథారిటీ, బ్రూనై ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్, సుహైల్ భవన్ గ్రూప్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని చేపట్టాయి. నాలుగు ప్రధాన కేంద్రాలతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. తల్లి, పిల్లల కేంద్రం, కంటి వైద్య చికిత్స కేంద్రం, గుండె చికిత్స కేంద్రం, ఎముకలు అలాగే వెన్ను చికిత్సా కేంద్రం వీటితోపాటుగా ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన కేంద్రాలు, లేబరేటరీలతో ఈ ప్రాజెక్టుని తీర్చిదిద్దారు. 100కి పైగా బెడ్స్ సౌకర్యం ఇందులో వుంది. క్రిటికల్ కేర్ యూనిట్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, స్పెషల్ చైల్డ్ కేర్ యూనిట్, పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వున్నాయి. 41 మెడికల్ కన్సల్టేషన్ కార్యాలయాలు, అబ్జర్వేషన్ అలాగే చికిత్స మరియు పరీక్షల నిర్వహణ కోసం కోసం 73 గదులు, ఐదు ఆపరేటింగ్ గదులు, నాలుగు డెలివరీ గదులు, నాలుగు లేబరేటరీలు, అత్యవసర యూనిట్లు, రేడియాలజీ, రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ఏర్పాట్లున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







