సౌదీ అరేబియా: ఇకపై మహిళలూ ట్యాక్సీలను నడపొచ్చు

- January 07, 2022 , by Maagulf
సౌదీ అరేబియా: ఇకపై మహిళలూ ట్యాక్సీలను నడపొచ్చు

సౌదీ అరేబియా: సౌదీ మహిళలు వాహనాలు నడిపేందుకు వీలుగా దాదాపు నాలుగేళ్ళ క్రితం వెసులుబాటు కల్పించగా, ఇకపై ట్యాక్సీలను కూడా నడిపేందుకు వారికి అవకాశం దక్కుతోంది. సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. మహిళలు జనరల్ ట్యాక్సీ లైసెన్సుని దేశంలోని 18 డ్రైవింగ్ స్కూళ్ళలో దేన్నుంచైనా పొందవచ్చునని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. 2018లో మహిళలు వాహనాలు నడిపేందుకు అనుమతిచ్చారు సౌదీ అరేబియాలో. కాగా, మహిళలు విమానాలు, రేసింగ్ కార్లు అలాగే రైళ్ళను నడిపేందుకు కూడా అవకాశం దొరుకుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com