నవదీప్ ఫాం హౌస్ పార్టీపై వస్తున్న కథనాలను నటుడు బ్రహ్మాజీ ఖండించాడు
- March 26, 2016
శనివారం ఉదయం నుంచి మీడియాలో హీరో నవదీప్ ఫాం హౌస్ పార్టీపై వస్తున్న కథనాలను నటుడు బ్రహ్మాజీ ఖండించాడు. హైదరాబాద్ శివార్లలోని నవదీప్ ఫాం హౌస్ లో రేవ్ పార్టీ జరిగిందని, ఆ పార్టీపై పోలీసులు దాడి చేయగా నవదీప్ సహా పలువురు సినీ నటులు పరారీలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై నవదీప్ స్పందిస్తూ, అది రేవ్ పార్టీ కాదని కుటుంబ సభ్యులంతా కలిసి గృహవేశ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిపాడు.తాజాగా ఇదే విషయంపై నటుడు బ్రహ్మాజీ కూడా స్పందించాడు. నవదీప్ పై వస్తున్న వార్తలన్ని అవాస్తవాలని తెలిపిన అతడు, తాను కూడా కుటుంబ సమేతంగా ఆ పార్టీలో పాల్గొన్నట్టుగా తెలిపాడు. ఇది పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన ఫాం హౌస్ పార్టీ అంటూ ట్వీట్ చేశాడు.అయితే నవదీప్ చెప్పినట్టుగా ఇది గృహప్రవేశ కార్యక్రమం అన్నట్టుగా కాకుండా, అది ఫాం హౌస్ పార్టీ అని చెప్పాడు బ్రహ్మాజీ.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







