ఒంటరిగా ఫ్లైట్ లో ప్రపంచయాత్ర.. రియాద్ లో ఆగిన మహిళ కెప్టెన్
- January 08, 2022
సౌదీ: ప్రపంచవ్యాప్తంగా సోలోగా విమానాన్ని నడిపిన అతి పిన్న వయస్కురాలైన మహిళా పైలట్‌గా రికార్డు సృష్టించే ప్రయత్నంలో బెల్జియన్ జాతీయురాలు జారా రూథర్‌ఫోర్డ్ తేలికపాటి ఫ్లైట్ లో ప్రపంచ యాత్ర చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం రియాద్‌లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఆగింది. 20 ఏళ్ల మహిళా పైలట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి రియాద్ చేరుకున్నది. సౌదీ అరేబియాలోని బెల్జియం రాయబారి డొమినిక్ మైనూర్, అనేక మంది రియాద్ ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ, సౌదీ ఏవియేషన్ క్లబ్ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.సౌదీ అరేబియాతో సహా 52 దేశాల గుండా ఐదు ఖండాల్లో 32,000 మైళ్ల దూరం ప్రయాణించాలనే లక్ష్యంతో ప్రొఫెషనల్ కెప్టెన్ తన షార్క్ విమానంలో ఆగస్టు 2021లో పశ్చిమ బెల్జియంలోని కోర్ట్రిజ్క్-వెవెల్‌గెమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







