ఏపీ మంత్రి పేర్ని నానితో భేటి కానున్న వర్మ
- January 08, 2022
అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై మాట్లాడేందుకు రామ్ గోపాల్ వర్మ... మంత్రి పేర్నినానితో భేటీ కానున్నారు. ఈ నెల 10 వ తేదీన మధ్యాహ్నం సమావేశానికి రావాలని... మంత్రి నుంచి ఆహ్వానం అందినట్లు వర్మ ట్విట్టర్‌లో వెల్లడించారు. సినీరంగ సమస్యలపై అభిప్రాయాలను పంచుకునేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ఆయన పేర్ని నానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి మంత్రి పేర్నినాని కూడా సమాధానమివ్వడం.. ఆ తర్వాత మళ్లీ వర్మ కౌంటర్ ఇవ్వడంతో... వ్యవహారం రసవత్తరంగా మారింది. చివరికి మంత్రి పేర్ని నాని రామూను చర్చలకు పిలవడంతో... ఈ ట్వీట్ల యుద్ధానికి తెరపడింది. ఇక ఇప్పుడు ముందుగా చెప్పినట్లుగానే... మంత్రి వర్మను సమావేశానికి ఆహ్వానించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







