ఎయిర్ అంబులెన్స్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది
- March 26, 2016
రోగిని ఆసుపత్రికి తరలిస్తున్న ఓ ఎయిర్ అంబులెన్స్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఇరాన్‌లోని ఫార్స్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో అంబులెన్స్‌లోని వారంతా మృతిచెందారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..ఇరాన్‌లోని ఓ మారుమూల గ్రామం నుంచి రోగిని షిరాజ్ నగరంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఎయిర్ అంబులెన్స్‌లో రోగితో సహా, నలుగురు వైద్యులు, సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







