వలసదారులకు బహ్రెయిన్ 'చీపెస్ట్ ప్లేస్'
- March 26, 2016
బహ్రెయిన్, వలసదారులు నివసించడానికి అత్యంత అనువైన దేశాల్లో ఒకటిగా ఘనతను దక్కించుకుంది. ఇక్కడ నివసించేందుకు తక్కువ ఖర్చు సరిపోతుందని ఆ సర్వే స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 14000 మంది వలస కార్మికులతో ఈ సర్వేని నిర్వహించారు. బహ్రెయిన్ టాప్ 30లో చోటు సంపాదించుకుంది. బహ్రెయిన్ స్థానం 23. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ మరియు కువైట్ తదితర దేశాలు టాప్ 50లో నిలిచాయి. సౌదీ అరేబియా 9, ఒమన్ 18, బహ్రెయిన్ 23, యూఏఈ 37, కువైట్ 45, ఖతార్ 46 స్థానాల్ని సంపాదించుకున్నాయి. ఈక్వెడార్ చీపెస్ట్ కంట్రీగా లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. సెంట్రల్ యూరోపియన్ దేశాలైన పోలాండ్, జెక్ రిపబ్లిక్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 2015 సర్వేలో వలసదారులకు చీపెస్ట్ దేశాలుగా ఈక్వెడార్, మెక్సికో, మాల్టా, సింగపూర్, లగ్జెంబర్గ్, న్యూజిలాండ్, థాయిలాండ్, పనామా, కెనడా, ఆస్ట్రేలియా చోటు దక్కించుకున్నాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







