మహేష్ బాబు సోదరుడు నటుడు రమేష్ బాబు కన్నుమూత..
- January 08, 2022
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు నటుడు రమేష్ బాబు (56) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన లివర్ సమస్యతో భాదపడుతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆయన చికిత్స తీసుకుంటున్నారు. కాగా శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు రమేష్ బాబు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేష్ బాబు మృతి చెందినట్టు తెలుస్తోంది. రమేష్ బాబు 1965 అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరాలకు మొదటి సంతానంగా జన్మించారు. రమేష్ బాబు బాల నటుడిగా తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో పరిచయం అయ్యారు. ఆ తర్వాత రమేష్ బాబు, కృష్ణ నటించిన పలు సినిమాల్లో హీరో చిన్ననాటి వేశాల్లో నటించారు. ముఖ్యంగా ‘మనుషులు చేసిన దొంగలు’, ‘దొంగలకు దొంగ,’ ‘అన్నదమ్ముల సవాల్’ వంటి చిత్రాల్లో చిన్పప్పటి హీరో పాత్రల్లో నటించారు రమేష్ బాబు.
రమేష్ బాబు దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’, ‘పాలు నీళ్లు’ చిత్రాల్లో నటించారు. రమేష్ బాబు.. వి.మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సామ్రాట్’తో హీరోగా పరిచయం అయ్యారు. తొలి చిత్రం ‘సామ్రాట్’తో మంచి విజయాన్ని అందుకున్నారు రమేష్ బాబు. ఆ తర్వాత ఈయన ‘చిన్ని కృష్ణుడు’, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, బ్లాక్ టైగర్’ ‘ముగ్గురు కొడుకులు’, కృష్ణ గారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు, ఆయుధం వంటి పలు చిత్రాల్లో నటించారు. రమేష్ బాబు చివరగా.. 1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో ఎన్కౌంటర్’ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత రమేష్ బాబు ఏ చిత్రంలో నటించలేదు.
ఇక హీరోగా కెరీర్ ముగిసాక.. మహేష్ బాబు హీరోగా కృష్ణ ప్రొడక్షన్స్ హౌస్ స్థాపించి.. ‘అర్జున్’ ‘అతిథి’ చిత్రాలను తెరకెక్కించాడు. అంతేకాదు ‘దూకుడు’ ‘ఆగడు’వంటి చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలియుగ కర్ణుడు’ ముగ్గురు కొడుకులు, ఆయుధం, చిరవగా ‘ఎన్కౌంటర్’ చిత్రాల్లో తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు రమేష్ బాబు. తమ్ముడు మహేష్ బాబుతో నిర్మాతగా సినిమాలు నిర్మించడమే కాకుండా.. తమ్ముడుతో కలిసి ‘‘బజారు రౌడీ’, ‘ముగ్గురు కొడుకులు’ చిత్రాల్లో కలిసి నటించారు రమేష్ బాబు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, తమ్ముడు మహేష్ బాబుతో కలిసి ‘ముగ్గురు కొడుకులు’ చిత్రంలో కలిసి నటించిన రమేష్ బాబు. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







