ఘుబ్రాలో ప్రారంభం కానున్న ఆస్టర్ రాయల్ హాస్పిటల్
- January 09, 2022
మస్కట్: ఆస్టర్ ఒమన్ కొత్త ఫ్లాగ్‌షిప్ హాస్పిటల్ ఏప్రిల్ 2022లో సుల్తానేట్‌లో ప్రారంభం కానుంది. ఆస్టర్ రాయల్ హాస్పిటల్‌లో వివిధ దేశాలకు చెందిన 150 మంది కొత్త డాక్టర్స్, సిబ్బంది ఉంటారు. 200 పడకల సౌకర్యం, ఆధునిక సాంకేతికతలు, మౌలిక సదుపాయాలతో 24 గంటల అత్యవసర సేవను అందిస్తుంది. మస్కట్‌లోని లెవాటియో హోటల్‌లో గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆసుపత్రి లోగోను ఆస్టర్ ఒమన్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఆశిక్ సైను మొహియాదీన్ ఆవిష్కరించి మాట్లాడారు. గత 14 సంవత్సరాలుగా ఒమన్‌లో ఉన్నామని, చికిత్స కోసం ఒమన్ నుండి భారతదేశానికి వెళ్లే చాలా మంది రోగులను తాను చూశానన్నారు. ఇప్పుడు ఆస్టర్ రాయల్‌తో, ఏ ఒమానీ చికిత్స కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఒమన్ నుండి రోగులు భారతదేశానికి వెళ్లిన ప్రతి సౌకర్యం, ట్రీట్ మెంట్ ఇప్పుడు వారి స్వంత దేశంలో అందుబాటులో ఉంటుందన్నారు. ఆస్టర్ ఒమన్, ఆస్టర్ కేరళ ప్రాంతీయ డైరెక్టర్ ఫర్హాన్ యాసిన్ మాట్లాడుతూ.. ఆస్టర్ రాయల్ హాస్పిటల్‌లో భాగంగా ఆస్టర్ ఎట్ హోమ్ అనే కొత్త సర్వీస్ ను కూడా ప్రారంభించబోతున్నామన్నారు. దేశంలో ఇలాంటి కాన్సెప్ట్ అందుబాటులోకి రావడం ఇదే తొలిసారని.. ఇంట్లోనే వైద్య సేవలు పొందడానికి ఇష్టపడే వ్యక్తుల కోసం ఈ సర్వీస్ అందించబడుతుందన్నారు. తమ యాప్ ద్వారా అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసుకోవచ్చన్నారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







