60 ఏళ్లు పైబడిన ప్రవాసుల ఇష్యూపై కొనసాగుతున్న చర్చలు

- January 09, 2022 , by Maagulf
60 ఏళ్లు పైబడిన ప్రవాసుల ఇష్యూపై కొనసాగుతున్న చర్చలు

కువైట్: 60 ఏళ్లు పైబడిన ప్రవాసుల వర్క్ పర్మిట్ ఇష్యూపై చర్చలు కొనసాగుతున్నాయి. 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న నాన్-గ్రాడ్యుయేట్ ప్రవాసుల సమస్యను పరిష్కరించడంలో న్యాయ మంత్రి, కౌన్సెలర్ జమాల్ అల్-జలావి ఆసక్తిగా ఉన్నారు. గత ఏడాది కాలంగా ఈ కేటగిరీ వ్యక్తుల వర్క్ పర్మిట్‌లను పునరుద్ధరించడాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆదివారం ఈ ఇష్యూ పై చర్చించి తగిన పరిష్కారాలను తీసుకుంటారని భావిస్తున్నారు. గత క్యాబినెట్ సెషన్ లో 60 ఎండ్ల ప్రవాసుల ఇష్యూ పై ఓ నిర్ణయానికి రాకుండానే ముగిసింది. వర్క్ పర్మిట్ గడువు ముగిసిన ఈ కేటగిరీకి చెందిన ప్రవాసులకు అంతర్గత మంత్రిత్వ శాఖ తాత్కాలిక నివాస అనుమతులను మంజూరు చేస్తూనే ఉందని జమాల్ అల్-జలావి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com