రెస్టారెంట్ల కోసం కొత్త ప్రోటోకాల్స్
- January 11, 2022
సౌదీ అరేబియా: రెస్టారెంట్ల, కేఫ్ ల కోసం కొత్త ప్రోటోకాల్స్ ను అప్డేట్ చేశారు. సోషల్ డిస్టెన్స్ నిబంధనల మేరకు రెస్టారెంట్ల కోసం కొత్త ప్రోటోకాల్స్ ను మునిసిపల్, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండ్ గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ రూపొందించాయి. రెస్టారెంట్లు, కేఫ్‌ల కోసం అప్డేట్ చేసిన హెల్త్ ప్రోటోకాల్‌ను పబ్లిక్ హెల్త్ అథారిటీ (వెఖాయా) జారీ చేసింది. కొత్త ప్రోటోకాల్స్ ప్రకారం, ఒక టేబుల్ వద్ద ఎక్కువ మంది భోజనం చేయడాన్ని రద్దు చేశారు. రెండు టేబుల్స్ మధ్య దూరం కనీసం మూడు మీటర్లు ఉండాలి. రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల్లోకి ప్రవేశం తవక్కల్నా అప్లికేషన్లో టీకా షెడ్యూల్‌ను పూర్తి చేసిన వారికి మాత్రమే పరిమితం చేశారు. వైద్య కారణాలతో వ్యాక్సిన్ తీసుకోకుండా మినహాయించబడిన వారికి మినహాయింపు ఇచ్చారు. రెస్టారెంట్లు, కేఫ్లలోకి ప్రవేశించే ముందు కస్టమర్ల ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు ఆటోమేటెడ్ వెరిఫికేషన్ కోసం QR కోడ్‌ని స్కాన్ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







