కోవిడ్ 19: టెస్టింగ్ ఇకపై వుండకపోవచ్చు.!
- January 11, 2022
యూఏఈ: కోవిడ్ 19 పాండమిక్ నేపథ్యంలో చాలా మార్పులు జీవన శైలిలో వస్తున్నాయనీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, దాని వ్యాప్తిని అరికట్టలేకపోతున్నాం గనుక, కాస్త కామన్ సెన్స్ ఉపయోగిస్తే.. కోవిడ్ 19తో మనం సహజీవనం చేయక తప్పదనే విషయం బోధపడుతుందని దుబాయ్ ఎయిర్ పోర్ట్స్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ముందు ముందు కోవిడ్ టెస్టులతో ఉపయోగం వుండదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రయాణీకులు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడం మినహా చేయగలిగిందేమీ లేదని అన్నారాయన. పాండమిక్ సమయంలో దుబాయ్ ఎయిర్ పోర్ట్ మూతపడలేదనీ, అయితే కొన్ని ఆంక్షలు తప్పలేదనీ, ఇకపై అలాంటి ఆంక్షలు కూడా వుండాల్సిన అవసరం వుండదని చెప్పారు. కోవిడ్ భయాల నుంచి కోలుకుని, పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ కొనసాగుతున్న సమయంలో ఇంకో వేవ్ వచ్చిందనీ, దీన్ని సైతం సమర్థవంతంగా తట్టుకుని నిలబడుతున్నట్లు దుబాయ్ ఎయిర్ పోర్ట్స్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ విమానాశ్రయాలతో పోల్చితే దుబాయ్ విమానాశ్రయ నిర్వహణ చాలా ప్రత్యేకమైనదని సీనియర్ అధికారి గ్రిఫిత్స్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







