ఏపీ కరోనా అప్డేట్
- January 11, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది.నిన్నటితో పోలిస్తే .. నేడు ఏకంగా 100 శాతం కరోనా కేసులు పెరిగాయి. నేడు ఆంధ్ర ప్రదేశ్‌లో 1,831 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యాఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క రోజు వ్యవధిలో పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడం గత ఆరునెలల్లో ఇదే మొదటి సారి.సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 984 కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 100కుపై గా కొత్త కేసులు నమోదయ్యాయి.
ఒక్క రోజులో రాష్ట్రంలో ఇన్ని కేసుల నమోదు కావడంతో రాష్ట్ర ప్రజలు, వైద్యా ఆరోగ్య అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగా రాష్ర్టంలో కరోనా వ్యాప్తి ఎక్కువున్న నేపథ్ంయలో రాష్ర్ట ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ను ఈ నెల 18 నుంచి అమలు చేయనుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కాగా ఈ నెలలో వచ్చే సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ కరోనా పై చూపే అవకాశం ఉంది. దీంతో పండగ రోజుల్లో కరోనా కేసులు ఎక్కువ రాకుండా ఉండాలని ప్రజలను ప్రభుత్వ వర్గాలు, ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,195 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







