కాంటాక్ట్ పర్సన్ ఐసోలేషన్ కు కొత్త గైడ్ లైన్స్
- January 12, 2022
కువైట్: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ (MoH) ఐసోలేషన్ కు సంబంధించిన కోవిడ్-19 కొత్త మార్గదర్శకాలు మంగళవారం నుండి అమలులోకి వచ్చాయి. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ ఉన్న వ్యక్తులకు క్వారంటైన్ పీరియడ్ 14 రోజులు ఉంటుందని MoH ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు.. 7 రోజుల తర్వాత PCR పరీక్షలో నెగిటివ్ వచ్చినట్లయితే క్వారంటైన్‌ను ముగించ వచ్చని చెప్పారు. అదే వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులు కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందే. పాజిటివ్ వచ్చిన వారికి 7 రోజులు (వాక్సిన్ తీసుకున్న వారు), 10 రోజులు (వాక్సిన్ తీసుకొని వారు) క్వారంటైన్ పీరియడ్ తగ్గించారు. ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించారు. రెండవ డోస్ తీసుకున్న వారు తొమ్మిది నెలల్లోపు, ఐసోలేషన్ పీరియడ్ ముగిసిన 28 రోజులలోపు బూస్టర్ డోస్ పొందొచ్చు. జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌ని పొందిన వారిలో తొమ్మిది నెలల పాటు రోగ నిరోధక శక్తి ఉంటుందని అల్-సనద్ చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







