ఎట్టకేలకు దిగొచ్చిన సిద్ధార్థ్..సైనా ఏమంటుందో చూడాలి
- January 12, 2022
భారత్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల నుంచి సిద్ధార్థ్ తీరుపై విమర్శలు వస్తుండటంతో సిద్ధార్థ్ తప్పు తెలుసుకున్నాడు. సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖను విడుదల చేశాడు. 'డియర్ సైనా.. నా ట్వీట్ ద్వారా చేసిన రూడ్ జోక్‌కి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని కించపరిచాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. మిమ్మల్ని అవమానించాలని ఆ ట్వీట్ చేయలేదు.
నేను ఒక జోక్ వేశాను. అది తప్పుగా చేరింది. ఆ విషయంలో సారీ. నా ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేకున్నా కొందరు దానిని తప్పుగా చూపి నా మీద విమర్శలు చేశారు. మహిళలు అంటే నాకు ఎంతో గౌరవం. నా ట్వీట్‌లో జెండర్‌కు సంబంధించిన విషయాలేవీ లేవు. నా క్షమాపణలు అంగీకరిస్తావని కోరుకుంటున్నా' అంటూ విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు నువ్వు ఎప్పుడూ నా చాంపియన్‌గా ఉంటావు సైనా.. అంటూ సిద్ధార్థ్ లేఖలో పేర్కొన్నాడు.
Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY
— Siddharth (@Actor_Siddharth) January 11, 2022
కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సమయంలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై.. 'దేశ ప్రధానికే భద్రత లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిణామాల్ని ఖండిస్తున్నా' అంటూ సైనా ట్వీట్ చేయగా.. దీనిపై హీరో సిద్ధార్థ్ వ్యంగంగా బదులిస్తూ..'ఓ చిన్న కాక్ తో ఆడే ప్రపంచ ఛాంపియన్' అంటూ సైనాపై అభ్యంతరకర రీతిలో సిద్ధార్థ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!







