ఖతార్ పోర్టల్‌లో కొత్తగా ట్రావెల్ ఎంట్రీ అరైవల్ ప్రక్రియ
- January 12, 2022
ఖతార్: ఖతార్‌లోకి ప్రవేశించేటప్పుడు ప్రయాణీకుల ఎంట్రీని వేగవంతం చేయడానికి Ehteraz వెబ్‌సైట్‌లో "ఖతార్ పోర్టల్‌లోకి ట్రావెల్ ఎంట్రీ" ఆప్షన్ ను ప్రవేశ పెట్టారు. దీంట్లో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లు, PCR పరీక్షలు, హోటల్ క్వారంటైన్‌తో సహా మీ క్వారంటైన్-సంబంధిత సమాచారాన్ని ముందుగానే ఆన్‌లైన్‌లో సమర్పించ వచ్చని ఎయిర్‌పోర్ట్ పాస్‌పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ కెప్టెన్ అబ్దుల్ అజీజ్ అల్ రుమ్హైహి తెలిపారు. ఖతార్‌కు తిరిగి వచ్చే వ్యక్తులకు, ప్రత్యేకించి పిల్లలతో ప్రయాణిస్తున్న వారికి ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పోర్టల్ ఉద్దేశించబడిందన్నారు. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సిటిజన్స్, రెసిడెంట్స్ లకు ఇ-గేట్‌లను ఉపయోగించడానికి కూడా ఈ సర్వీస్ అనుమతిస్తుంది. ప్రవాసులు దేశంలోకి ప్రవేశించడానికి కనీసం మూడు రోజుల ముందు Ehteraz వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. వారి పత్రాలను అప్‌లోడ్ చేసి వెబ్‌సైట్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకొవాలి. ప్రయాణము సమయంలో ఒరిజినల్ PCR టెస్ట్ రిపోర్ట్ వెంట తీసుకు రావాలి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







