వెంకటేష్. నాగచైతన్య కలిసి నటిస్తున్నారు..!
- March 26, 2016
టాలీవుడ్ ట్రెండ్ క్రియేషన్ మొదలైందని చెప్పాలి.. ఇదవరకు మల్టీస్టారర్ అంటే ఇద్దరు హీరోలకు సమానమైన ఇమేజ్ ఉండేలా ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసేలా చూసేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది పాత్ర ప్రాధాన్యతను బట్టి స్టార్ హీరో అయినా సరే ఓ సినిమాలో చిన్న రోల్ ఉంది అని తెలిస్తే చేసేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో నడుస్తున్న భారీ మల్టీస్టారర్ హవాలో రానున్న ఈ కాంబినేషన్ కూడా క్రేజ్ సంపాదించనుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమం తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అతిధి పాత్రలుగా కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారు.అయితే ఈ మధ్యే విక్టరీ వెంకటేష్ కు సంబందించిన సన్నివేశాలు షూట్ చేయడం జరిగిందట. స్వయానా అల్లుడు హీరోగా నటిస్తున్న సినిమాలో మేనమామ నటించడం ఎంతో క్రేజీగా మారింది. కొద్దికాలంగా సినిమాల పరంగా వెనుకపడ్డ వెంకటేష్ తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇక తనతో పాటుగా తన అల్లుడు కూడా స్టార్ ఇమేజ్ అందుకోవాలని తనకు సహకారం అందిస్తున్నాడు. ప్రేమం సినిమాలో ప్రిన్సిపాల్ రోల్ చేస్తున్నాడు వెంకటేష్. నాగచైతన్యకు క్లాస్ పీకే ప్రిన్సిపాల్ గా వెంకీ అదరగొట్టేశాడని టాక్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ సమ్మర్ వార్లో దిగనుంది. మలయాళంలో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న ప్రేమం అదే ఫలితాన్ని తెలుగులో కూడా పొందాలని చూస్తున్నారు చిత్రయూనిట్. నాగ చైతన్యతో పాటుగా సినిమాలో శృతి హాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు.
తాజా వార్తలు
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం







