రాహుల్ రామకృష్ణ విషయంలో కధ అడ్డం తిరిగింది..
- February 07, 2022
'అర్జున్ రెడ్డి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యి తనకంటూ టాలీవుడ్లో ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ.
తను ఏ సినిమాలో ఉన్నా.. అందులో కామెడీ ఖాయం అన్నట్టుగా హామీ ఇచ్చేశాడు రాహుల్. ఆ తర్వాత వచ్చిన 'జాతిరత్నాలు'తో ఒకేసారి స్టార్ స్థాయికి ఎదిగాడు. ఇటీవల రాహుల్ రామకృష్ణ.. తాను సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్టు ట్వీట్ చేశాడు. కానీ ఈ ట్వీట్ గురించి తాజాగా క్లారిటీ ఇచ్చాడు రాహుల్ రామకృష్ణ.
'2022నే నా లాస్ట్. నేను ఇంక సినిమాలు చేయను. నేను కేర్ చేయను. ఇంకెవరూ కూడా కేర్ చేయొద్దు' అని ఇటీవల ట్వీట్ చేశాడు రాహుల్ రామకృష్ణ. దీంతో తన ఫ్యాన్స్ అందరూ ఉన్నట్టుండి ఏమైంది అని అడగడం మొదలుపెట్టారు. కానీ దేనికి రాహుల్ సమాధానం ఇవ్వలేదు. వెంటనే కాసేపటికి అసలు ఆ ట్వీట్ ఎందుకు చేశాడో క్లారిటీ ఇచ్చాడు రాహుల్ రామకృష్ణ.
'అదంతా జోక్ ఫూల్స్. నేనెందుకు మంచి పారితోషికం, లగ్జరీ లైఫ్ వంటి ఎన్నో లాభాలున్న జీవితాన్ని వదిలేసుకుంటాను. నేను నిజంగానే రిటైర్మెంట్ తీసుకున్నాననుకుని నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మరీ కంగ్రాట్స్ చెపుతుండటం ఆశ్చర్యాన్ని కలిగించింది' అని రాహుల్ రామకృష్ణ క్లారిటీ ఇచ్చాడు. దీనికి ఫాలోవర్స్ అందరూ ముందు అలా చెప్పడం ఎందుకు? ఇప్పుడు ప్రాంక్ అని అనడం ఎందుకు అని రాహుల్‌పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







