మస్కట్: రెంట్ అగ్రిమెంట్లపై కొత్త నిబంధనలు
- February 16, 2022
ఒమన్: అద్దె ఒప్పందాలకు సంబంధించి మస్కట్ మునిసిపాలిటీ కొత్తగా తొమ్మిది నిబంధనలను నిర్దేశించింది. ఫస్ట్ పార్టీ (భూమి ఓనర్) మస్కట్ మునిసిపాలిటీతో ఒప్పందాన్ని నమోదు చేసి, స్థిర పన్ను (నెలవారీ అద్దెలో మూడు శాతం) చెల్లించవలసి ఉంటుంది. సెకండ్ పార్టీ (టెనెంట్) విద్యుత్, నీటి బిల్లులు, మురుగునీటి సర్వీస్ ఛార్జీలు అద్దెదారు భరించాలి. లీజుకు తీసుకున్న ఆస్తిని అద్దెదారుకు అప్పగించిన తేదీ నుండి ఈ నిబంధనకు అమల్లోకి వస్తుంది. ఒప్పందం నమోదు చేయకపోవడం లేదా పునరుద్ధరణ చేయడం/లేదా దాని సంతకం లేదా గడువు ముగిసిన ఒక నెలలోపు స్థిర పన్నును చెల్లించడంలో విఫలమైతే స్థిర పన్నుకు మూడు రెట్లు సమానమైన జరిమానా విధించబడుతుంది. అదేసమయంలో అలాంటి ఒప్పందాన్ని రద్దైన ఒప్పందంగా పరిగణించబడతారు. ఒకవేళ పన్ను చెల్లించని పక్షంలో మున్సిపాలిటీ పన్ను, రాయల్ డిక్రీ No 6/89 దాని సవరణల నిబంధనల ప్రకారం.. జప్తు ద్వారా వసూలు చేసుకునే అధకారం మునిసిపాలిటీ అధికారులకు ఉంది. ఇక టెనెంట్ చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఒప్పందాన్ని రద్దు చేసే అవకాశాన్ని ఓనర్లకు కల్పించారు. వారిని ఖాళీ చేయంచడంతోపాటు నిర్దేశిత సమయంలో వాటిని మరోకరికి అప్పగించే వెసులుబాటును ఓనర్లకు కల్పించారు. అదే సమయంలో టెనెంట్ లకు పలు అధికారాలను కొత్తగా నిర్దేశించారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







