ఉక్రెయిన్ యుద్ధం: పుతిన్ కు ఎలన్ మస్క్ సవాల్... ఈ గోల ఎలా ముగుస్తుందో!!
- March 15, 2022
రష్యా మరియు ఉక్రెయిన్ దేశాలు పక్క పక్కనే ఉన్న సంగతి తెలిసిందే. గత నెల రోజుల ముందు ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరేందుకు అన్ని చర్చలు జరిగి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక దానికి సంబందించిన అగ్రిమెంట్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు అధికారికంగా సంతకం చేసి చేరడమే ఇక మిగిలింది. అటువంటి తరుణంలో రష్యా దేశం ఉక్రెయిన్ పై ఒత్తిడి తీసుకు రావడం స్టార్ట్ చేసింది. ఎటువంటి పరిస్థితుల్లో మీరు నాటో కూటమిలో చేరడానికి వీల్లేదని చెబుతూ వచ్చింది. అయితే తగ్గేదేలే అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు నాటోలో చేరడానికి మొగ్గు చూపాడు. దీనితో ఆగ్రహించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించాడు.
అలా గత 20 రోజుల క్రితం రష్యా కు మరియు ఉక్రెయిన్ కు మధ్యన యుద్ధం మొదలైంది. అయితే మొదట్లో రష్యా ఇన్ని రోజుల పాటు యుద్ధం చేయాల్సి వస్తుందని ఊహించనే లేదని తెలుస్తోంది, కొన్ని రోజులకే ఉక్రెయిన్ లొంగి పోతుందని భావించారు. కానీ అలా జరగకపోగా ఉక్రెయిన్ కూడా రష్యా కు ధీటుగా పోరాడుతోంది. ప్రస్తుతం ఈ యుద్ధం ఆపడానికి ప్రపంచంలో ఉక్రెయిన్ కు మద్దతు తెలుపుతున్న దేశాలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రపంచ కుబేరుడు మరియు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ట్విట్టర్ వేదికగా వార్నింగ్ ఇచ్చాడు.
ఈయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ పుతిన్ నీకు దైర్యం ఉంటే ఒంటరిగా నాతో పోరాడు అమాయక ప్రజలతో కాదు, మన ఇద్దరిలో గెలిచిన వారికే ఉక్రెయిన్ దేశం మీద హక్కు అంటూ సంచలన ప్రకటన చేశాడు. అంతే కాకుండా ఈ ట్వీట్ పై వెంటనే రిప్లై ఇవ్వాలని సూచించాడు. అయితే పుతిన్ కు ట్విట్టర్ అకౌంట్ లేదన్న సంగతి తెలిసిందే. మరి ఎలా పుతిన్ ఇతని ట్వీట్ కు రిప్లై ఇస్తాడో చూడాల్సి ఉంది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







