సన్ అఫ్ సత్యమూర్తి:రివ్యూ
- April 09, 2015
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన చిత్రం ‘సన్ అఫ్ సత్యమూర్తి ‘. అత్తారింటికి దారేది సూపర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ నుండి వచ్చిన ఈ చిత్రం ఫై అబిమనులతో పాటు చిత్ర సీమలో కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సమంత, నిత్య మీనన్, అధ శర్మ , ఉపేంద్ర, స్నేహ ముఖ్య పాత్రలలో నటించగా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షేకుల అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం…
కథ:
సత్యమూర్తి (ప్రకాష్ రాజ్) కొడుకు విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్) బాగా డబ్బు ఉన్న ఎన్అర్ఐ, స్వేచ్ఛాయుతమైన జీవితం గడిపే ఓ యువకుడు. మానవవిలువలను నమ్మే గొప్ప వ్యక్తి సత్యమూర్తి. ఆపదలో ఉన్న వ్యక్తులను కాపాడుతూ, ధనధర్మాలు చేస్తూ, మంచి పేరు సంపాదించుకున్న సత్యమూర్తి, ఓ ఆక్సిడెంట్ లో చనిపోతాడు.
దాంతో సత్యమూర్తి చేసిన అప్పులు తీర్చే భాద్యత విరాజ్ ఆనంద్ ఫై పడుతుంది. సత్యమూర్తి బెస్ట్ ఫ్రెండ్ అయిన సాంబశివరావు (రాజేంద్ర ప్రసాద్) ఓ కోటీశ్వరుడు. కానీ పిల్లి కూడా బిచ్చం వేయనంత పిసినారివాడు. సాంబశివరావు చెప్పిన ఓ పని ని ఒప్పుకొని విరాజ్ ఆనంద్ అక్కడి నుండి ఇండియా కు వచ్చిన వెడ్డింగ్ కాంట్రాక్టు గా పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. ఓ రోజు సాంబశివరావు సత్యమూర్తి కి చెందినా ఓ ల్యాండ్ డీటెయిల్స్ ని విరాజ్ ఆనంద్ కు చెపుతాడు. కానీ అప్పటికే ఆ ల్యాండ్ ని దేవరాజ్ (ఉపేంద్ర) చేతిలో కబ్జా కు గురివుతుంది. ఇదే సమయం లో రాజేంద్ర ప్రసాద్ కూతురు సుబ్బలక్ష్మి (సమంత) ని ప్రేమిస్తాడు విరాజ్ ఆనంద్ ఇక్కడే కథ లో అద్బుత మైన మలుపు. ఆ మలుపు ఏంటి..? సత్యమూర్తి చేసిన అప్పులు విరాజ్ ఎలా తీరుస్తాడు..? విరాజ్ కు మిగతా ఇద్దరి హీరోయిన్స్ కి సంబంధం ఏంటి..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే…
ప్లస్ :
మాటలా మాంత్రికుడిగా పేరు పొందిన త్రివిక్రమ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అనిపిస్తుంది. సినిమాకి వెళ్ళిన మనందరిని సమ్మోహితుల్ని చేయటానికి చేసే సామర్థం వున్న అతి తక్కువ మంది లో ఒకే ఒక్కడు త్రివిక్రమ్. నాన్న యొక్క ప్రాముఖ్యతని చెప్పిన విధానం ఎంతో అభినందనీయం, నేటి యువతకు ఎంతో అవసరం అనిపిస్తుంది. త్రివిక్రమ్ మానవ విలువల మీద రాసిన డైలాగ్స్ సినిమాకి పెద్ద హైలైట్.
అల్లు అర్జున్ మొదటిసారి పూర్తి స్దాయి నటన ఈ చిత్రం లో మనం చూడవచ్చు. అలాగే అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ లో అందరిని అలరించాడు. తన నటన తో పాటు డాన్స్ లలో కూడా తనకు తనే చాటి అనిపించుకున్నాడు. ఓ తండ్రి చేసిన అప్పులు తీరుస్తూ, ప్రేమించిన అమ్మాయి ప్రేమ ను పొందడానికి చేసిన సహాసాలు ఇలా ఒక్కటే ఏంటి ఈ చిత్రం లో బన్నీ నటన అద్బుతం అని చెప్పాలి.
డయాబెటిక్ పేషెంట్ గా సమంత నటన చాల బాగుంది. ఇలాంటి రోల్స్ ఒప్పుకోవడానికి ఏ హీరోయిన్ కూడా ముందుకు రారు. అంతే కాకుండా తన నటన తో పాటు గ్లామర్ తో కూడా ప్రేక్షేకులను కట్టిపడేసింది. నిత్య మీనన్ పాత్ర చిన్నది అయిన తన నటన తో ఆకట్టుకుంది.
రాజేంద్ర ప్రసాద్ కోటీశ్వరుడి పాత్రలో నటించి, సినిమా సెకండ్ హాఫ్ అంత తన భుజలా ఫై వేసుకుని కథను నడిపించాడు. అలాగే బ్రహ్మానందం – రాజేంద్ర ప్రసాద్ ల మద్య వచ్చే కామెడీ కూడా బాగుంది. ప్రకాష్ రాజ్ చిన్న పాత్ర అయిన కానీ చాలా గొప్పగా నటించాడు. చాల గ్యాప్ తర్వాత ఉపేంద్ర తెలుగు తెర ఫై కనిపించి అలరించాడు. స్నేహ, కోట శ్రీనివాస రావు, వెన్నెల కిషోర్ మిగితా ఆర్టిస్ట్ లు తమ పాత్ర లకు నాయ్యం చేసారు.
మైనస్ :
ముఖ్యంగా చిత్రం ఫస్ట్ హాఫ్ అంత స్లో గా సాగుతుంది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అబిమానులు ఎన్నో అంచనాలతో థియేటర్స్ కు వస్తారు కానీ ఫస్ట్ హాఫ్ కాస్త వారిని నిరశ కు గురిచేసింది. అలాగే సూపర్ హిట్ అయిన పాటలు మాత్రం సినిమా లో సమయం సందర్భం లేకుండా వస్తాయి.
అలీ కామెడీ కూడా అంతగా వర్క్ అవ్వలేదు. వెన్నెల కిషోర్ ఓ అర్ధం లేని పాత్రలో నటించాడు. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షేకులను చిరాకు తెప్పిస్తాయి. త్రివిక్రమ్ నుండి సినిమా అంటే కామెడీ కి పెద్ద పీటం వేస్తాడు. కానీ ఈ చిత్రం కామెడీ ని తెరకెక్కించడం లో విఫలం అయ్యాడని చెప్పవచ్చు. అల్లు అర్జున్ – సమంత ల మద్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలను ఇంకా బాగా తీస్తే బాగుండు అనిపించింది.
సాంకేతిక విభాగం :
ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్…ఇతడి గురించి ఏమి చెప్పిన ఎంత చెప్పిన తక్కువే. త్రివిక్రమ్ – దేవి శ్రీ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి చిత్రం సూపర్ హిట్ అనే సంగతి అందరికి తెలుసు. అలాగే అల్లు అర్జున్ – దేవి కాంబినేషన్ కూడా సూపర్ సక్సెస్ అని చెప్పవచ్చు. ఈ చిత్రం లో కూడా సాంగ్స్ అన్ని బాగున్నాయి కానీ సినిమా లో సందర్భం లేకుండా రావడం తో కాస్త అబిమానులు నిరాశ కు గురియ్యారు.
ముఖ్యంగా సినిమాటోగ్రఫీ గురించి మనం చెప్పుకోవాలి..ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ళకి అదించిన సినిమాటోగ్రఫీ సినిమా కె హైలైట్ అనిపిస్తుంది. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా ఈ చిత్రం లో ఏ ఒక్కరినీ కూడా తక్కువ కాకుండా, అందరిని తెర ఫై బాగా చూపించాడు. రవీందర్ ఆర్ట్ వర్క్ బాగుంది. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ అందరినీ ఆకట్టుకుంటాయి.
చివరిగా :
‘S/O సత్యమూర్తి’ – ‘విలువలే ఆస్తి’ అంటూ ఈ వేసవి దాహాన్ని తీర్చడం లో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. యువత ను అక్కట్టుకునే అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ రప్పించడం త్రివిక్రమ్ మరోసారి విజయం సాదించాడు. ఫస్ట్ హాఫ్ కాస్త బోర్ అనిపించినా సెకండ్ హాఫ్ మానవవిలువలు మరచిపోతున్న ఈ రోజుల్లో.. చక్కటి కుంటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. మొత్తంగా ఈ వేసవికి చక్కగా మీ కుంటుంబం తో కలిసి చూడదగిన చిత్రం ‘S/O సత్యమూర్తి’..
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్‌లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన







