రావణ్ తిట్ల
- April 07, 2015చక చకా తయారయ్యే ఒక స్పైసి మరియు ఘాటయిన కూర మీ అందరి కోసం!
కావలసిన పదార్ధాలు:
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 1 కప్పు
- సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు - 1 కప్పు
- పచ్చి కారం - 1 కప్పు
- శనగపిండి - 1 కప్పు
- ఆయిల్ - 1 కప్పు
- కరివేపాకు - కొద్దిగా
- కొత్తిమీర - కొద్దిగా
- ఉప్పు – తగినంత
చేయు విధానం:
- ముందుగా ఒక కడాయి లో ఆయిల్ వేడి చేయాలి. జీలకర్ర ని వేయించాలి.
- ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- సన్నగా తరిగిన పచ్చి మిరపకాయల్ని, కరివేపాకు వేసి ఒక 2 నిమిషాల పటు వేగనివ్వాలి.
- పచ్చి కారం, శనగపిండి వేసి పిండి యొక్క పచ్చి వాసన పోయేదాకా వేయించండి.
- ఇప్పుడు మీకు నచ్చే చిక్కదనం కు సరిపడా నీరు పోసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి.
- కొత్తిమీర చల్లి వడ్డించండి. (ఉడికించుకున్న కూరగాయలు కూడా వేసుకోవచ్చు)
----- సి. లీల కుమారి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







