ఉక్రెయిన్‌కు 6 వేల క్షిపణులు, 25 మిలియన్ పౌండ్ల ఆర్థిక సాయం
- March 24, 2022
లండన్: ఉక్రెయిన్ పై రష్యా దాడి 29వ రోజుకు చేరింది. రష్యా దాడులను తిప్పికొట్టడంతో ఉక్రెయిన్ ప్రదర్శిస్తోన్న ధైర్యం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. దీంతో రష్యా దాడుల తీవ్రతను పెంచడంతో ఉక్రెయిన్‌కు బ్రిటన్ మరింత సాయం ప్రకటించింది. ఆరు వేల క్షిపణులు, 25 మిలియన్ పౌండ్ల ఆర్థిక సాయం చేస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు.
తాము ఉక్రెయిన్‌కు చేయనున్న ఆయుధ సాయంలో మిలిటరీ హార్డ్‌వేర్, యాంటీ ట్యాంక్, ఇతర భారీ ఆయుధాలు కూడా ఉన్నాయని వివరించారు. అలాగే, రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు రెట్టింపు చేయాలని ఆయన పాశ్చాత్య దేశాలకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ కు మరింత సాయం చేయడానికి తమ భాగస్వామ్య పక్షాలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఉక్రెయిన్ లోని నగరాలను రష్యా ధ్వంసం చేస్తోంటే తాము చూస్తూ ఉండలేమని తెలిపారు. ఇక ఇప్పటికే బ్రిటన్ ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున ఆయుధ సాయం చేసింది. ఇప్పుడు చేస్తోన్న సాయం దానికి అదనం. రష్యా తీరుపై చర్చించడానికి నాటో, జీ 7 దేశాలు త్వరలో సమావేశం కానున్నాయి. ఈ సమయంలో బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్‌కు మరింత సాయం ప్రకటించడం గమనార్హం.
తాజా వార్తలు
- అండమాన్ సెల్యులార్ జైలులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..
- యూజర్లకు UPI ఛార్జీలు ఉండవు.. కేంద్రం మరోసారి క్లారిటీ
- డేటింగ్ యాప్‌లో పురుషులకు అందంతో వల...రూ.6 కోట్లు వసూళ్లు
- మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం..మూడు దేశాల జెండా రంగుల్లో మెరిసిన సౌదీ ల్యాండ్‌మార్క్స్
- BRICS వాణిజ్య మంత్రుల సమావేశంలో యూఏఈ..
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్‌పై ఇరాన్ దాడిని జీసీసీ తీవ్రంగా ఖండించింది
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడి..బహ్రెయిన్ తీవ్ర ఖండన
- హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి..సిబ్బంది సురక్షితం
- దుబాయ్‌లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్‌కు 2.7మిలియన్ కాల్స్..!!







