డాక్టర్ వ్యాలెట్‌ని దొంగిలించిన కేసులో ఇద్దరు అన్నదమ్ములకు జైలు
- April 14, 2022
మనామా: హై క్రిమినల్ కోర్టు ఇద్దరు అన్నదమ్ములకు దొంగతనం కేసులో రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. ఓ డాక్టర్ వ్యాలెట్‌ని నిందితులు దొంగిలించారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్ళిన నలభయ్యేళ్ళ నిందితుడు, తనతోపాటు తన 35 ఏళ్ళ తమ్ముడిని కూడా తీసుకెళ్ళాడు. వైద్య పరీక్షల నిమిత్తం లేబరేటరీలోకి వెళ్ళగా, ఓ హ్యాండ్ బ్యాగ్ అందులో వ్యాలెట్ కనుగొన్నారు నిందితులు. బ్యాగ్ తెరచి, అందులోని వ్యాలెట్ తీసుకుని పారిపోయారు. తన బ్యాగులో 25 బహ్రెయినీ దినార్ల నగదు అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఐీ కార్డు పలు ఏటీఎం కార్డులు వున్నాయని బ్యాగు పోగొట్టుకున్న డాక్టర్ పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుంచి నిందితులు పారిపోగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల్ని గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. ఏటీఎం కార్డుల ద్వారా నగదు విత్ డ్రా కోసం కూడా నిందితులు ప్రయత్నించారుగానీ, పిన్ నంబర్ తెలియకపోవడంతో అది సాధ్యపడలేదని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







