జాయ్ ఆఫ్ షేరింగ్ క్యాంపెయిన్ ప్రారంభించిన లులు హైపర్ మార్కెట్

- April 14, 2022 , by Maagulf
జాయ్ ఆఫ్ షేరింగ్ క్యాంపెయిన్ ప్రారంభించిన లులు హైపర్ మార్కెట్

కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో సాటి మనుషుల పట్ల ప్రేమభావం పెంచుకోవడం, అవసరాల్లో వున్నవారిని ఆదుకోవడం పవిత్ర కార్యంగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే లులు హైపర్ మార్కెట్ ‘జాయ్ ఆఫ్ షేరింగ్’ అనే క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ ద్వారా రోజుకి 250 ఇఫ్తార్ కిట్స్ అవసరమైనవారికి అందించాలనే లక్ష్యంతో ముందడుగు వేసింది లులు సంస్థ. ఇప్పటికే వేలాది మందికి లులు సంస్థ ఈ క్యాంపెయిన్ ద్వారా ఇప్తార్ కిట్స్ అందించింది. ఇప్తార్ కిట్స్‌లో ఆహార పదార్థాలు వుంటాయి. ఉపవాస దీక్షలు చేపట్టేవారిలో కొందరికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన ఆహారం వుండదు గనుక, వారికి ఈ కిట్స్ ద్వారా ఉపశమనం కలుగుతుందని లులు సంస్థ పేర్కొంది. మొత్తం 39 రోజులపాటు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com