ఉక్రెయిన్ కి భారీ మొత్తంలో ఆయుధాలు పంపిన స్పెయిన్ క్వీన్
- May 02, 2022
కీవ్: ఉక్రెయిన్ యుద్ధ సామర్థ్యాన్ని పెంచడానికి స్పెయిన్ క్వీన్ ఏకంగా గ్రెనేడ్లు, గ్రెనేడ్ లాంచర్లు, ఇతర ఆయుధాలను భారీ మొత్తంలో ఆ దేశానికి షిప్‌మెంట్ చేసింది. ఉక్రెయిన్ తాజాగా, స్పెయిన్ నుంచి వచ్చిన ఆయుధాల షిప్‌మెంట్‌ను స్వీకరించిందని వైస్‌గ్రాడ్ అనే మీడియా సంస్థ ట్విట్టర్‌లో వెల్లడించింది. ఆ షిప్‌మెంట్‌లో స్పెయిన్ రాణి స్వదస్తూరితో రాసిన ఐ విష్ యూ విక్టరీ అనే సందేశాన్ని రాసి ఉంచారు. విత్ లవ్ లెటీషియా అనే లైన్ కూడా ఆ పోస్టు కార్డుపై రాశారు.
ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా మార్గాలను ధ్వంసం చేసే ఎత్తును రష్యా బలగాలు వేశాయి. ఇందులో భాగంగా రైల్వేకు ఇంధనం సమకూర్చే ఆరు ఫెసిలిటీలను పేల్చేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తద్వార ఈ రైల్వే నెట్‌వర్క్ ద్వారా ఆయుధాలను దొన్‌బాస్ రీజియన్‌కు సరఫరా చేపట్టడం ఉక్రెయిన్‌కు కష్టతరంగా మారింది. అంతేకాదు, ఇతర దేశాల నుంచి ఉక్రెయిన్ ఆయుధాలను దిగుమతి చేసుకోకుండా రైల్వే నెట్‌వర్క్ మొత్తాన్ని నాశనం చేయాలని రష్యా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే స్పెయిన్ క్వీన్ గిఫ్ట్‌గా వెపన్స్ షిప్‌మెంట్ పంపడం ఉక్రెయిన్‌కు ఎంతో కలిసి వచ్చింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







