ప్రపంచవ్యాప్తంగా మే 6న ఆర్జీవీ మా ఇష్టం (డేంజరస్) విడుదల
- May 04, 2022
హైదరాబాద్: డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతూ నేటితరం ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. జానర్ ఏదైనప్పటికీ తాను ఏదైతే చెప్పాలని అనుకుంటున్నారో దానికి తెర రూపమిస్తున్నారు.విలక్షణ దర్శకుడిగా వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న ఆయన.. దేశంలోనే తొలిసారి 'మా ఇష్టం' సినిమా రూపంలో ఓ లెస్బియన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఈ మా ఇష్టం (డేంజరస్) చిత్రాన్ని మే 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు రామ్ గోపాల్ వర్మ. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ చేపట్టిన ఆర్జీవీ.. ఆస్క్ ఎనీథింగ్ అనే కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో పాటు చిత్రంలో లీడ్ రోల్స్ పోషించిన నైనా గంగూలీ, అప్సర రాణి పాలొన్నారు. లెస్బియన్ శృంగారం విషయమై పలువురు స్టూడెంట్స్, రాముయిజం ఫాలోవర్స్ అడిగిన ఘాటైన ప్రశ్నలకు వర్మ ఓపెన్ గా సమాధానాలు చెప్పి మెప్పించారు.ఈ సినిమా ఓ డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని, గతంలో ఎన్నడూ చూడనివిధంగా ఉంటుందని ఆర్జీవీ చెప్పారు.
ఇది మహిళల మధ్య సాగే ఘాటు ప్రేమ కథ. స్త్రీ, పురుషుని మధ్య ప్రేమ, లైంగిక వాంఛ ఎలా అయితే ఉంటాయో వీరి మధ్య కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ప్రేమ అనేది ప్రేమ మాత్రమే. దానికి లింగబేధంతో ఎలాంటి సంబంధం లేదు అని పేర్కొంటూ వదిలిన 'మా ఇష్టం' ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది.క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







