'శేఖర్' ట్రైలర్ వచ్చేసింది..!
- May 05, 2022
హైదరాబాద్: రాజశేఖర్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన మూవీ శేఖర్.. జీవిత రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ క్రమంలో మేకర్స్ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ''పోలీస్ యూనిఫామ్ వేసుకొని కూడా డ్యూటీ చేయని వాళ్లు చాలామంది ఉంటారు. అదే, పోలీస్ ఉద్యోగానికి రిజైన్ చేసి కూడా డ్యూటీ కోసం ప్రాణాలిచ్చే వాళ్లు వేలల్లో ఒక్కరే ఉంటారు'' అంటూ సమీర్ చెప్పే డైలాగ్ తో మొదలైన శేఖర్ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. రాజశేఖర్ యంగ్ అండ్ ఓల్డ్ లుక్స్ లో ఈ సినిమాలో కనిపించనున్నారు.. ఆయన కూతురు శివాని ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు.
మలయాళంలో సూపర్ హిట్ ఐన 'జోసెఫ్' సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గారం వెంకట శ్రీనివాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







