'విరాట పర్వం' జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల
- May 06, 2022
హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా జూలై 1 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆసక్తికంరగా వుంది. అడవిలో రానా గన్ గురి పెట్టుకొని దూకుడుగా నడుస్తుండగా సాయి పల్లవి రానా చేయి పట్టుకొని పరుగు తీయడం ఒక వార్ మూమెంట్ ని తలపిస్తుంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. త్వరలో చిత్ర యూనిట్ ప్రమోషన్‌ల జోరు పెంచనుంది.
1990లలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొంది తెరకెక్కించిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రావన్న పాత్రను పోషించారు. సాయి పల్లవి, వెన్నెల పాత్రలో కనిపించనుంది. యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథగా విరాట పర్వం ఉండబోతుంది.
ఈ చిత్రానికి డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించగా, సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు.
ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.
తారాగణం:
రానా దగ్గుబాటి, సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్, బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి తదితరులు
సాంకేతిక విభాగం:
రచన-దర్శకత్వం: వేణు ఊడుగుల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సమర్పణ: సురేష్ బాబు
సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైన్: శ్రీనాగేంద్ర
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
స్టంట్స్: స్టీఫెన్ రిచర్డ్, పీటర్ హెయిన్
కొరియోగ్రఫీ: రాజు సుందరం
పీఆర్వో: వంశీ-శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ చాగంటి
పబ్లిసిటీ డిజైన్: ధని ఏలే
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







