వేపాకులతో చర్మసంరక్షణ
- April 06, 2016
నిత్యం అందుబాటులో ఉండే వస్తువులతోనే సౌందర్యాన్ని కాపాడుకోగలిగితే ఎంతో హాయిగా ఉంటుంది కదా. అలాంటి వాటిల్లో ముందుంటుంది వేప. వేపాకులతో చర్మసంరక్షణ ఎలాగంటే... * ఓ పెద్దగిన్నెడు నీటిలో గుప్పెడు వేపాకుల్ని వేసి మరిగించండి. ఆ నీటిని స్నానం చేసే నీళ్లతో కలిపి ఉపయోగిస్తే చర్మసంబంధమైన ఇన్ఫెక్షన్లు, మొటిమలు, దురదల్లాంటివి దూరం అవుతాయి. లేదంటే ఈ ఆకుల్ని వేసి మరిగించిన కషాయాన్ని చిన్న సీసాలో వేసి నిల్వ ఉంచండి. రోజూ ఉదయాన్నే ఆ నీటిలో దూదిని ముంచి ముఖానికి రాసుకుని కాసేపాగి కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది.
తలస్నానం చేస్తుంటే చుండ్రు సమస్య అదుపులోకి వస్తుంది.
* రెండు వేపాకులు, కాసిని గులాబీ రేకలు కలిపి ముద్దగా చేసుకుని దానికి చెంచా తేనె కలిపి రాసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగి మృదువుగా మారుతుంది. ఇలా కనీసం వారానికి ఒకసారైనా చేస్తుంటే ఫలితం ఉంటుంది.
* జిడ్డు చర్మతత్వం ఉంటే పావుచెంచా వేపపొడిలో కాస్త పెరుగు కలిపి ముఖానికి పట్టిస్తే ఫలితం ఉంటుంది. వేపా, మందార ఆకులు కలిపి ముద్దగా నూరి తలస్నానం చేసే ముందు రాసుకుంటే జుట్టుకి తగిన పోషణ అందుతుంది. మెరుపూ సంతరించుకుంటుంది. జుట్టు ఆరోగ్యంగానూ ఎదుగుతుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







