హాస్య నటుడు కుళ్ల ప్రభు మృతి..
- April 06, 2016
హాస్యనటుడు కుళ్ల ప్రభు(52) బుధవారం చెన్నైలో కన్నుమూశారు. నటుడు వడివేలుతో కలసి పలు చిత్రాల్లో నటించిన కుళ్లప్రభు పోట్రి, ఇంద్రలోకత్తిల్ నా అళగప్పన్, అమర్కళం, అవన్ ఇవన్, ఇండియా పాకిస్థాన్ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించారు. స్థానిక నమ్మాళ్వార్ పేట, సుబ్బరాయన్ 3వ వీధిలో నివశిస్తున్న కుళ్లప్రభు కొన్ని నెలలుగా థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారు.బుధవారం ఉదయం ఆయన స్వగృహంలో కన్నుమూశారు. కుళ్లప్రభుకు భార్య ప్రభ, అజిత్‌కుమార్(15), తమిళ్‌సెల్వన్(10)అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్తను కోల్పోయిన ప్రభ శోకసముద్రంలో మునిగిపోయారు. ఆమె తమ స్థితిగతుల గురించి చెప్పుకుంటూ తన భర్త 22 ఏళ్లుగా దక్షిణ భారత నటీనటుల సంఘంలో సభ్యుడిగా ఉన్నారన్నారు.
అర్జున్, వడివేలు తదితర పలువురు నటులతో కలసి నటించారని ఆమె చెప్పారు. ఇటీవల అవకాశాలు తగ్గిపోయాయని తెలిపారు. తమ బిడ్డల్ని చదివించుకోలేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నామని, దక్షిణ భారత నటీనటుల సంఘం ఏదేని ఆర్థికసాయం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఆమె కన్నీటిప ర్యంతం అయ్యారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







