సెన్సేషనల్ డైరెక్టర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు..
- April 06, 2016
రామ్ గోపాల్ వర్మ...ఈ పేరు సెన్సేషన్ కు కేరాఫ్ అడ్రస్. వర్మ ఏ సినిమా తీసినా అదొక సంచలనమే. కామెంట్ చేసినా సంచలనమే. ఎవరినైనా మెచ్చుకున్నా, విమర్శించినా సంచలనమే. సెన్సేషన్ సంగతి ఎలా ఉన్నా ఆయన చేసేది, చెప్పేది.. చూసేవారికి, వినేవారికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వర్మ సంచలనాలకే పరిమితమనుకుంటే పొరపాటే. ఆయనలో ఓ సామాజిక స్పృహ ఉంది. సమాజానికి మంచి చేయాలనే తపన ఉంది. కొన్ని సినిమాల్లో మనకు ఈ వాస్తవం కనబడుతుంది.వర్మ సినిమాల్లో డైరెక్ట్ గానో, అంతర్లీనంగానో ఏదోక మెసేజ్ ఉంటుంది. అసలు రాము స్కూల్ వేరు. డిటెక్షన్ సినిమా తీసినా, మాఫియాపై మూవీ తీసినా, సమాజంలోని అన్యాలను ఎండగట్టినా...రొమాంటిక్ తీసినా.వాటిలో ఏదొ ఒక పర్పస్ ఉంటుంది. ఆయన సినిమాలు ఏవీ రొటీన్ గా ఉండవు. మనీ, సత్య, కంపెనీ, గాయం, సర్కార్, జంగిల్, సర్కార్ రాజ్, రక్త చరిత్ర, స్కూల్, డి... వంటి సినిమాలు వర్మ మేధావితత్వానికి నిదర్శనంగా నిలుస్తాయి.వర్మ కు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫాలోయింగ్ ఉంది. ఓ ఐడెంటిటీ ఉంది. ఆయనకు ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఆయన సినిమాలు ప్రదర్శించబడ్డాయి. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ...స్లమ్ డాగ్ మిలియనీర్స్ డైరెక్టర్ డేనీ బోయల్ ...వర్మ గురించి చెబుతూ తనపై వర్మ ఇన్ ఫ్లుయెన్స్ ఉందన్నాడు. భారతదేశంలో పేదరికం గురించే కాదు, మాఫియా గ్యాంగ్ కు సంబంధించిన చీకటి కోణాలను కూడా ఆవిష్కరించాడని డేనీ వర్మను అభినందించాడు.ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా, నిజాయితీగా, ఎలాంటి రంగు పులమకుండా చెప్పడం రామ్ గోపాల్ వర్మ నేచర్. మరి ఇలాంటి సెన్సేషనల్ డైరెక్టర్ కి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేద్ధాం.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







