వేడి దరిచేరకుండా తీసుకోవలసీన ఆహారపదార్ధాలు ..

- April 07, 2016 , by Maagulf
వేడి దరిచేరకుండా తీసుకోవలసీన ఆహారపదార్ధాలు ..

ఈ కాలంలో ఎండలో బయటకు వెళ్లినా, వెళ్లకపోయినా... వేడి ప్రభావం ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి సమస్యలు దరిచేరకుండా.. తగిన ఆహార పదార్థాలను ఎంచుకోవాలి. అవేంటంటే.. * ఈ కాలంలో వేడి నుంచి బయట పడేసి శరీరానికి చల్లదనం అందించే వాటిలో తర్భూజది అగ్రస్థానం.
ఉదయం అల్పాహారం తీసుకున్నాక, మధ్యాహ్నం భోజనం తరవాత కొన్ని ముక్కలు తింటే శరీరం చల్లబడుతుంది. రసం చేసి.. అందులో కాస్త తేనె, చిటికెడు ఉప్పు చేర్చి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆకర్షణీయమైన గ్లాసుల్లో పోసి ఇస్తే....పిల్లలూ ఇష్టంగా లాగించేస్తారు.
* తరచూ తీసుకునే ఆహారంలో పుదీనాను చేర్చుకోవడం వల్ల శరీరానికి మంచిది. యాక్నె, మొటిమల వంటివీ దూరమవుతాయి. గ్లాసు నీళ్లలో పుదీనా ఆకుల్ని... వేసి మరిగించాలి. ఈ నీళ్లని వడకట్టి... అందులో తేనె చేర్చి తీసుకున్నా ఫలితం ఉంటుంది.
* వేడి ప్రభావం వల్ల చర్మం వూరికే అలసటకు గురవుతుంది. అందుకే తప్పనిసరిగా కనీసం రోజుకో కీరదోసకాయను తినాలి. కీరా ముక్కలు తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌ బారిన పడదు. అలానే కొబ్బరి నీళ్లు...చెరకురసం, బార్లీ నీటిని కూడా తీసుకోవచ్చు.
* ఎండలో బయటకు వెళ్లి వచ్చాక నీళ్లకి బదులు నిమ్మరసం తీసుకోవాలి. ఈ రసంలో చక్కెరకు బదులు తేనె చేర్చాలి. చల్లని పాలలో...చాక్లెట్‌, స్ట్రాబెర్రీ, కమలా ఫలం వంటివి ఏదో ఒకటి చేర్చి మిక్సీ చేయాలి. ఇలా తయారైన స్మూతీలో కాస్త తేనె చేర్చి ఉదయం పూట తీసుకుంటే ఎండ ప్రభావం మన మీద పడదు.
* శరీరంలో నీటిశాతం కోల్పోయి...నిస్సత్తువగా అనిపించినపుడు పుచ్చకాయను తినాలి. పుచ్చకాయ ద్వారా చాలా త్వరగా నీటిశాతం శరీరానికి అందుతుంది. పుచ్చకాయ రసంలో ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే మంచిది.
* గ్లాసుడు నీళ్లలో ఎండు ఖర్జూరాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పిప్పి తీసేసి ఆ నీటిని తాగితే వడదెబ్బ తగలదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com