మధ్యప్రాచ్యంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సౌదియా ఎయిర్‌లైన్
- June 06, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా ప్రభుత్వ యాజమాన్యంలోని సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ (సౌదియా) మధ్యప్రాచ్యంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌లైన్‌గా ర్యాంక్ పొందిందని కంపెనీ తెలిపింది. కింగ్డమ్ జాతీయ ఫ్లాగ్ క్యారియర్ 13.1% పెరిగిందని, బ్రాండ్ ఫైనాన్స్ ద్వారా 'A' బ్రాండ్ రేటింగ్‌తో రేట్ చేయబడిందని పేర్కొంది. ఈ మేరకు బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ ఇటీవల తన వార్షిక నివేదికలో ప్రచురించినట్టు తెలిపింది. ఇది ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 ఎయిర్లైన్లకు ర్యాంక్ ఇచ్చింది. విజన్ 2030లో భాగంగా 2030 నాటికి పర్యాటకుల సంఖ్యను 100 మిలియన్లకు, మతపరమైన సందర్శకుల సంఖ్యను సంవత్సరానికి 30 మిలియన్లకు పెంచాలని రాజ్యం భావిస్తోంది. సౌదియా తన ఫ్లీట్‌లో దాదాపు 150 నారో, వైడ్‌బాడీ ఎయిర్‌బస్, బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయని.. అవి 100 కంటే ఎక్కువ గమ్యస్థానాలకు ఆపరేట్ చేస్తున్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







