విక్రాంత్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’ చిత్రానికి .... మ్యూజిక్ డైరెక్టర్ హెషమ్ వహాబ్
- June 06, 2022
హైదరాబాద్: విక్రాంత్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా హై బడ్జెట్‌తో డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘స్పార్క్’. ఈ చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మే నెలలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి కుంటోంది. సినిమా అనౌన్స్ చేసిన రోజునే ప్రముఖ సంగీత దర్శకుడు ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తారని మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే.
చెప్పినట్లే హెషమ్ వహాబ్‌కు స్పార్క్ సినిమా సంగీత సారథ్య బాధ్యతలను అప్పగించారు. ప్రణవ్ మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన మలయాళ సూపర్ హిట్ ‘హ్రిదయం’ సినిమాకు మ్యూజిక్‌ను అందించారు. హ్రిదయం సినిమాలో ప్రతి పాట ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ డమ్‌ను అందుకున్న హెషమ్ వహాబ్ ఇప్పుడు రెండు తెలుగు సినిమాలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ - సమంత జంటగా నటించిన ఖుషి సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు స్పార్క్ సినిమాకు కూడా హెషమ్ సంగీతాన్ని అందించడానికి ఓకే చెప్పారు.
ఎఫ్ 3 వంటి సూపర్ సక్సెస్‌ఫుల్ చిత్రం తర్వాత మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రమిది. హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటోంది. త్వరలోనే యూరప్‌లోని అందమైన లొకేషన్స్‌లో తదుపరి షెడ్యూల్‌ను చిత్రీకరించబోతున్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్‌తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







