అమెరికన్ వర్సిటీల్లో వీసాల కుంభకోణం రట్టు
- April 08, 2016
నకిలీ వర్సిటీ స్కాం ఎఫెక్ట్ డిపోర్టేషన్కు సిద్ధమన్న అమెరికా అధికారులు వాషింగ్టన్ అమెరికన్ వర్సిటీల్లో వీసాల కుంభకోణం రట్టు చేసేందుకు ఇటీవలే భారీ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి.. 21 మంది అక్రమార్కులను అరెస్టు చేసిన హోంలాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ అధికారులు ఇప్పుడు విద్యార్థులపై దృష్టి సారించారు. ఈ ఆపరేషన్లో తమకు తెలియకుండానే భాగమై యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్న్యూజెర్సీ విద్యార్థులుగా అమెరికా గడ్డపై అడుగుపెట్టిన 306 మందినీ అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి వారిని భారతకు తరలించేందుకు (డీపోర్టేషన్) ఏర్పాట్లు చేస్తున్నట్టు యూఎ్సఐసీఈ అధికార ప్రతినిధి అల్విన్ ఫిలిప్స్ తెలిపారు. యూఎ్సలో పెరిగిపోతున్న వీసా కుంభకోణాలను అరికట్టడం, అక్రమార్కులను పట్టుకోవడమే లక్ష్యంగా హోంలాండ్ సెక్యూరిటీ అధికారులు 2013 సెప్టెంబరులో యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ అనే నకిలీ వర్సిటీని సృష్టించారు. ఇదే సమయంలో అక్రమార్కులు రంగప్రవేశం చేశారు. ఆ వర్సిటీలో చేరేందుకు ఆసక్తి చూపిన విద్యార్థుల నుంచి పెద్దమొత్తంలో డబ్బు తీసుకుని దాదాపు 1000 మందికి స్టూడెంట్, వర్క్ పర్మిట్ వీసాలు జారీ చేయించారు. వీరిలో మనవాళ్లు 306 మంది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







