భారతీయుల అప్లికేషన్లే అధికం వాషింగ్టన్
- April 08, 2016
హెచ్-1బీ వీసాల కోసం భారత్ నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రస్తుత సంవత్సరంలో జారీ చేయనున్న 65 వేల వీసాల కోసం 2.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తెలిపింది. అంటే జారీ చేయాలనుకున్న వీసాల కంటే నాలుగు రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి.అమెరికాలో పనిచేయడానికి అత్యధిక నైపుణ్యం కలిగిన కార్మికులకోసం హెచ్-1బీ వీసాలను అక్కడి ప్రభుత్వం ప్రతియేటా జారీ చేస్తుంది. అమెరికాలో ఎస్టీఈఎం(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథ్యమేటిక్స్)లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు వీసా అందించనున్నది. ఏప్రిల్ 1నాటికి వీసాకోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతానికి దరఖాస్తులను స్వీకరించిన యూఎస్సీఐఎస్.. యాదృచ్చిక ఎంపిక ప్రక్రియ తేదిని మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. గతేడాది 2.30 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







