పాదచారులకు తాజా హెచ్చరిక జారీ చేసిన పోలీసులు

- July 01, 2022 , by Maagulf
పాదచారులకు తాజా హెచ్చరిక జారీ చేసిన పోలీసులు

షార్జా: ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో రోడ్ల మీద పాదచారులు అస్తవ్యస్తంగా నడవడం చాలా ప్రమాదకరం అని నగర పౌరులను హెచ్చరిస్తున్నారు షార్జా పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్ల మీద ప్రమాదకరమైన సాహసాలు చేస్తూ నడవడం  ద్వారా ప్రమాదాలకు గురి కావల్సి వస్తుంది. 

ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం ఎవరైతే ట్రాఫిక్ సిగ్నల్ మరియు క్రాస్ రోడ్స్ నిబంధనలను అతిక్రమించి వ్యవహరిస్తారో వారికి Dh 400 దిర్హామ్ ల జరిమానా విధించడం జరుగుతుందని షార్జా ట్రాఫిక్ మరియు పెట్రోలింగ్ విభాగం అధిపతి మేజర్ అబ్దుల్లా సలీం అల్ - మంధారి పేర్కొన్నారు. 

నగర పౌరులకు ట్రాఫిక్ చట్టాల మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు మా విభాగం సమయుత్తం అయ్యిందని చెబుతూనే కార్యక్రమానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని  కేవలం అరబిక్ భాషలోనే కాకుండా ఇంగ్లీష్ , ఉర్దూ భాషల ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా  సుమారు 17, 000 మందికి చేరువయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

పాదాచారుల భద్రతే లక్ష్యంగా కొనసాగే ఈ అవగాహన కార్యక్రమంలో వాహన చోదకులు యొక్క భాద్యతలు గురించి విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు అల్ మంధారి ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com