ఇరాక్‌లో కాల్పుల కలకలం..15 మంది మృతి
- August 30, 2022
బాగ్దాద్: ఇరాక్ లో ప్రముఖ షియా మతగురువు ముక్తాదా అల్-సదర్ దేశ రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడంతో రాజధాని బాగ్దాద్‌లో కాల్పులు కలకలం రేపాయి. ముక్తాదా ప్రకటన వల్ల ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ ప్యాలెస్‌పై వందలాది మంది నిరసనకారులు దాడులకు పాల్పడ్డారు. ప్యాలెస్ గోడలను బద్దలు కొట్టి.. భవనంలోకి చొచ్చుకుపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసనకారులను నిలువరించేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది మరణించగా, మరో వంద మంది గాయపడ్డారు.
తాజా ఘటనతో దేశవ్యాప్తంగా సైన్యం కర్ఫ్యూ విధించింది. కేబినెట్ సమావేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది ప్రభుత్వం. గతేడాది అక్టోబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అల్-సదర్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన విపక్షాలతో చర్చలు జరిపినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. షియా వ్యతిరేక వర్గాలతో మంతనాలు జరిపేందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారు.చర్చల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. దీంతో దేశంలో రాజకీయం వేడెక్కింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







