నకిలీ పత్రాలతో బ్యాంకుకే టోపీ వేసిన మోసగాడు
- April 17, 2016
ఒక బ్యాంకు ఉద్యోగి నకిలీ పత్రాలు ఉపయోగించి విజయవంతంగా బురిడీ కొట్టించాడు. తన సైనిక సేవ పూర్తి చేసినందుకు గాను డి హెచ్ 157,000 డబ్బును డ్రా చేసి తీసుకొన్నాడు. ఇందుకు మోసకరమైన అధికారిక పత్రాలను ఆ వ్యక్తి ఉపయోగించినట్లు ఆరోపించబడింది.30 ఏళ్ల ఎమిరేట్ ఉద్యోగి కె . హెఛ్ సైన్యంలో విధులని పూర్తి చేసినట్లుగా... సైనిక సేవ చేసినట్లు ఉన్న పత్రాలపై సమయం,తేదీలను దిద్ది తనకి అనుకూలంగా మార్చుకొన్నాడు. సాయుధ దళాల తరపున జారీ చేయబడిన ఈ పత్రాలు నకిలీవని నిపుణుల పరిశీలనలో తేలడంతో ఈ మోసం వెలుగులోనికి వచ్చింది. తాను 2015 లో సాయుధ దళాల్లో పనిచేసినట్లు బ్యాంకుకి విన్నవించి తనకు రావాల్సిన నగదుని వెంటనే మంజూరు చేయాలని పేర్కొన్నడు తర్వాత 157,000 డి హెచ్ లను బ్యాంకు నుండి అపహరించాడు.నకిలీ పత్రాలు ఉపయోగించి కె . హెఛ్ ఫోర్జరీ ద్వారా ఈ మోసానికి పాల్పడినట్లు న్యాయవాదులు ఆరోపణలు చేశారు. తొలుత అనుమానితుడు ఏమాత్రం ఈ నేరాన్ని అంగీకరించలేదు. మొదటి న్యాయ దుబాయ్ కోర్టు గత ఆదివారం అతని ఆరోపణలు తిప్పికొట్టింది.ఛార్జిషీట్ ప్రకారం, న్యాయవాదులు అనుమానితుడు అతను విజయవంతంగా తన సైనిక సేవ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు ఇది సాయుధ దళాల తరపున నాకు ఇచ్చిన ఒక కాగితం అని పేర్కొన్నారు. పని చేస్తున్నబ్యాంకును కూడా మోసం చేసినందుకు... చట్టపరమైన ఏ అర్హత లేకుండా డబ్బు తీసుకొన్నట్లు అతనిపై ఆరోపణలు చేశారు.
నిందితుడు ఎవరి వద్ద నుంచో సైన్యంలో పనిచేసినట్లుగా సాయుధ దళాల సర్టిఫికేట్ ని సేకరించి, దానిని తన మొబైల్ ఫోన్ లో ఫోటో తీసుకొన్నాడు. తర్వాత తన లాప్ టాప్ లో సర్టిఫికేట్ ఫోటోని వివరాలు హొదాను కాపీ మరియు పేస్ట్ ద్వారా మార్చి ప్రింటు తీసుకొని తాను పని చేస్తున్న బ్యాంకులో నకిలీ పత్రాలు ఉపయోగింఛి మోసపూరితంగా డబ్బు అపహరించినట్లు న్యాయవాదుల ఎదుట నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







