కనిదన్ సినిమాను రవితేజ రీమేక్ ..
- April 19, 2016
టాలీవుడ్ లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సీనియర్ హీరో రవితేజ. ఒకప్పుడు టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉన్న రవితేజ, ఇటీవల తన స్థాయికి తగ్గ సక్సెస్ లు సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు. అయితే ఇటీవల రవితేజ హీరోగా తెరకెక్కిన బెంగాల్ టైగర్ కమర్షియల్ గా ఆకట్టుకోవటంతో ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే కొత్త దర్శకుడితో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్న మాస్ మహరాజ్, మరో రీమేక్ సినిమాకు రెడీ అవుతున్నాడు.తమిళంలో ఘన విజయం సాధించిన కనిదన్ సినిమాను రవితేజ రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు అఫీషియల్ గా మాత్రం కన్ఫామ్ చేయలేదు. తాజాగా కనిదన్ చిత్ర దర్శకుడు ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు. రవితేజకు ఉన్న మాస్ ఇమేజ్ కు ఈ సినిమా ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని కితాబిచ్చాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







