కార్మిక శాఖ ఈపీఎఫ్ నియమావళిని సరళీకరించింది

- April 19, 2016 , by Maagulf
కార్మిక శాఖ ఈపీఎఫ్ నియమావళిని సరళీకరించింది

ఉద్యోగులకు భారీ ఊరట. కార్మిక శాఖ ఈపీఎఫ్ నియమావళిని సరళీకరించింది. పీఎఫ్‌ను విత్‌డ్రా చేసే అంశంలో కొన్ని ఆంక్షలను ఆ శాఖ తొలిగించినట్లు తెలుస్తోంది. ఇండ్ల నిర్మాణం, వైద్య ఖర్చులు, పిల్లల ఉన్నత విద్య కోసం పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునే వెసలుబాటును కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కింద వచ్చే ఉద్యోగులకు ఈ నియమావళి వర్తించనుంది. ఆగస్టు 2016 నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. విత్‌డ్రా చేసుకునే రోజున ఉద్యోగి అకౌంట్‌లో ఉన్న మొత్తం డబ్బును అతను పొందాలే నియమావళిని సరళీకరిస్తున్నారు. అంతేకాదు ఆ రోజు వరకు ఆ మొత్తం డబ్బుపై వచ్చే వడ్డీని కూడా ఇవ్వనున్నారు. ఇండ్ల నిర్మాణం, వైద్య ఖర్చులు, పిల్లల చదువు కోసం అయితేనే ఆ పీఎఫ్ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయనుంది. వాస్తవానికి ప్రభుత్వ ప్రతిపాదనను ఇంప్లాయిస్ ఫ్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) మొదట్లో తోసిపుచ్చింది. నూరు శాతం పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసే అవకాశాన్ని ఆ సంస్థ అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ మళ్లీ ఆంక్షలను సడలించినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com