అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2022 ప్రారంభం
- October 13, 2022
రియాద్: రియాద్ సీజన్ 2022 అక్టోబర్ 21న ప్రారంభించనున్నట్లు జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (GEA) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ టర్కీ అల్-షేక్ ప్రకటించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కెనడియన్ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం సిర్క్యూ డు సోలైల్చే అంతర్జాతీయ కచేరీ, సర్కస్ షో "బియాండ్ ఇమాజినేషన్" ప్రధాన ఆకర్షణగా ఉంటుందన్నారు. మొత్తం 65 రోజుల పాటు రియాద్ సీజన్ లో ప్రతిరోజు ఒక ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేసినట్లు అల్-షేక్ తెలిపారు. కొత్త సీజన్ కార్యకలాపాలు 15 జోన్లలో జరుగుతాయని.. వాటిలో ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన కార్యక్రమాలను కలిగి ఉన్నాయని అల్-షేక్ వివరించారు. జోన్లలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫ్రాన్స్, గ్రీస్, ఇండియా, చైనా, స్పెయిన్, జపాన్, మొరాకో, ఇటలీ, మెక్సికో వంటి ప్రపంచంలోని అనేక దేశాల సంస్కృతులు, వంటకాలను ఒకచోట చేర్చే 'బౌలెవార్డ్ వరల్డ్' అత్యంత ప్రముఖమైనదన్నారు. రియాద్ సీజన్ 2022 మొదటిసారిగా 'బౌలెవార్డ్ వరల్డ్' జోన్‌ను ప్రారంభిస్తుందని, ఇందులో ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ సందర్శకులు మొదటిసారిగా ఎడారి నడిబొడ్డున జలాంతర్గాముల్లో ప్రయాణించవచ్చన్నారు. ఈ సీజన్ లో 'రియాద్ జంతుప్రదర్శనశాల'ను పరిచయం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో 190 జాతులకు చెందిన 1,300 కంటే ఎక్కువ జంతువులు ఉన్నాయన్నారు. ఇంకా 'ఫ్యాన్ ఫెస్టివల్', ప్రపంచ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డిగో మారడోనాపై ప్రత్యేక ప్రదర్శన, రియాద్ ఇమాజినేషన్ పార్క్, WWE రెజ్లింగ్ ఈవెంట్, సువైదీ పార్క్, Zel హెరిటేజ్ మార్కెట్ తదితర అంశాలు సందర్శకులకు కొత్త అనుభూతి ఇస్తుందన్నారు. సౌదీ అరేబియా పర్యాటక రంగాన్ని పెంచే లక్ష్యంతో రియాద్ సీజన్ 2022 తన కార్యక్రమాలను రూపొందించిందని అల్-షేక్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







