ట్రాఫిక్ జామ్ ప్రాంతాలపై కువైట్ ఫోకస్

- October 13, 2022 , by Maagulf
ట్రాఫిక్ జామ్ ప్రాంతాలపై కువైట్ ఫోకస్

కువైట్: ముష్రిఫ్ రౌండ్‌అబౌట్‌తోపాటు అల్-గౌస్ స్ట్రీట్, సబా అల్-సలేం రౌండ్‌అబౌట్‌ ఆరవ రింగ్ రోడ్‌ను ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి, ఇంటీరియర్ తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ సందర్శించి ట్రాఫిక్ జామ్‌లపై సమీక్షించారు. ముఖ్యంగా ఉదయం సమయంలో రద్దీ అధికంగా ఉంటుందని, ఆ సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. అల్-ఖలేద్ ట్రాఫిక్ జామ్‌లకు కారణాలపై ఆరా తీశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి వీలైనంత త్వరగా పరిష్కారాలను వెతకాలని అధికారులను ఆదేశించారు.  దేశవ్యాప్తంగా ట్రాఫిక్ జామ్‌లయ్యే ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని, అంతర్గత మంత్రిత్వ శాఖ, అధికారుల మధ్య సహకారాన్ని తీవ్రతరం చేయాలని అధికారులకు అల్-ఖాలీద్ సూచించారు. అల్-ఖాలీద్‌ వెంట ట్రాఫిక్, ఆపరేషన్స్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ, మేజర్ జనరల్ జమాల్ అల్-సయెగ్, పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ ఇంజినీర్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ సుహా అష్కనాని, జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com