సింగర్ మంగ్లీకి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్
- November 22, 2022
సింగర్ మంగ్లీకి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్
అమరావతి: ఏపీ సీఎం జగన్..సింగర్ మంగ్లీకి కీలక బాధ్యతలు అప్పగించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సలహాదారుగా మంగ్లీని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం, బసినేపల్లె తాండకు చెందిన మంగ్లీ.. ప్రస్తుతం టాప్ సింగర్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. బోనాల సాంగ్స్ తో ఎంతో ఫేమస్ అయినా మంగ్లీ..ప్రస్తుతం అన్ని భాషల్లో సాంగ్స్ పాడుతూ అలరిస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్..మంగ్లీకి ఎస్వీబీసీ చానల్ సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రెండేళ్ల పాటు మంగ్లీ ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులకు కూడా ఇటీవలే సీఎం జగన్ కీలక పదవులు కట్టబెట్టిన విషయం తెలిసిందే. నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. అలాగే, ప్రముఖ కమెడియన్ ఆలీని ఏపీ ఎలక్ట్రానికి మీడియా సలహాదారు పదవి వరించింది. తాజాగా, మంగ్లీని ఎస్వీబీసీ చానల్ సలహాదారుగా నియమించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







