ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. 36 మంది సజీవదహనం
- November 22, 2022
చైనా: చైనాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హెనాన్ నగరంలో ఉన్న వర్క్‌షాప్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో 36 మంది మరణించగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ అగ్ని ప్రమాదం సోమవారం సాయంత్రం 4గంటల సమయంలో చోటు చేసుకుంది. 36 మంది మరణించగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరి ఆచూకీ లభ్యంకాలేదని స్థానిక అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే భారీగా మంటలు ఎగిసిపడటంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 200 మందికి పైగా సెర్చ్ రెస్క్యూ వర్కర్లు, 60 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి కారకులుగా భావిస్తున్న అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే, ప్రమాదానికి కారణాలపై పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు.
చైనాలో గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2019 మార్చినెలలో షాంఘైకి 260 కిమీ దూరంలోని యాంచెంగ్‌లోని ఒక రసాయన కర్మాగారం పేలింది. ఈ ఘటనలో 78 మంది మరణించారు. 2015లో ఉత్తర టియాంజిన్‌లోని ఒక రసాయన గోదాములో జరిగిన భారీ పేలుడులో 165 మంది మరణించారు.
తాజా వార్తలు
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు







