సుడిగాలి సుధీర్.! ‘గాలోడు’ హవా మామూలుగా లేదుగా.!
- November 23, 2022
బుల్లితెర పై కమెడియన్‌గా సుడిగాలి సుధీర్‌కి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కానీ, ఇప్పుడు ఆయన హీరో అయిపోయాడు. అంటే, గతంలోనూ కొన్ని సినిమాల్లో నటించాడనుకోండి. కానీ, ‘గాలోడు’ సినిమాతో హీరోగా సుధీర్ మంచి సక్సెస్ అందుకున్నాడు.
దాంతో, పెద్ద తెరపైనా సుడిగాలి సుధీర్ పేరు ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. గతంలోనూ హీరోగా ఒకట్రెండు సినిమాలతో పాటూ, సపోర్టింగ్ రోల్స్‌తోనూ ఆకట్టుకున్నాడు సుడిగాలి సుధీర్.
అయితే, ‘గాలోడు’ ఇచ్చిన వుత్సాహంతో సుడిగాలి సుధీర్ వెండితెరపై బిజీ కానున్నాడట. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘గాలోడు’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ధియేటర్లలో మంచి టాక్‌తో రన్ అవుతోంది. గతంలో ‘సాఫ్ట్వేర్ సుధీర్’ అను చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, అప్పుడు సక్సెస్ కాకపోయినా, ఇప్పుడు మంచి సక్సెస్ కొట్టాడు.
ఈ జోష్‌లోనే, ముచ్చటగా మూడోసారి సుధీర్‌తో కలిసి పని చేస్తానంటున్నాడీ డైరెక్టర్. ఈ సారి సుధీర్‌తో తీయబోయే చిత్రం ‘గజ్జెల గుర్రం’ అంటూ టైటిల్‌తో సహా ఆయన అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్టు వర్క్ జరుగుతోందట. ఈ సినిమాలో సుధీర్‌కి జోడీగా రష్మీ గౌతమ్‌ని తీసుకోవాలనుకుంటున్నాడట రాజశేఖర్ రెడ్డి.
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







