బహ్రెయిన్‌లో అక్రమ పార్కింగ్ పై అధికారుల ఉక్కపాదం!
- November 26, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ వీధుల్లో తరచుగా ట్రాఫిక్ జామ్‌లు అయ్యుంకు నివాసితులు, పౌరుల నిర్లక్ష్యపు పార్కింగ్ ప్రవర్తననే కారణం అని ఇలాంటి చర్యలపై దృష్టి సారించినట్లు బహ్రెయిన్ ట్రాఫిక్ అధికారులు తెలిపారు. కొందరు ఇతర వాహనాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా పార్కింగ్ చేస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే పార్కింగ్ సౌకర్యం లేని రెస్టారెంట్ల కస్టమర్లు ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా పార్కింగ్ చేస్తున్నారని, దీంతో ఆయా ఏరియాల్లో భారీగీ ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు కారణం అవుతుందన్నారు.
సంతోష్ కుమార్ అనే వ్యక్తి తన పార్కింగ్ కష్టాల గురించి వివరిస్తూ.. ఒక రోజు తన పిల్లలతో రెస్టారెంట్ డిన్నర్ చేయాలని అడ్లియాకు వెళ్లామన్నారు. “నేను రెస్టారెంట్ ముందు పార్కింగ్ చేశాను. డిన్నర్ చేయడానికి వెళ్ళాను. తిరిగి వచ్చినప్పుడు, నా కారుకు మరో కారు అడ్డంగా ఉంది. నేను ఆ కారు యజమానిని గుర్తించడానికి తీవ్రంగా ప్రయత్నించాను. ప్రయోజనం లేకపోయింది. రెస్టారెంట్ మేనేజర్ని సంప్రదించినా.. ఫలితం లేదు. చివరికి, వాహన యజమాని వచ్చి తన కారును తీసుకెళ్లే వరకు వేచి ఉన్నాను. ఇదంతా జరిగేందుకు 30 నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చింది.’’ అని వాపోయాడు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేయకుండా వీధుల్లో పెట్రోలింగ్ ఉండేలా చూడాలని అధికారులను సంతోష్ కోరుతున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







