క్యూ3లో 13.1% పెరిగిన సౌదీ చమురుయేతర ఎగుమతులు
- November 26, 2022
రియాద్: క్యూ3లో సౌదీ అరేబియా నాన్-ఆయిల్ ఎగుమతులు 13.1% పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో SR69.4 బిలియన్లు ఉండగా.. ఇపుడు SR78.4 బిలియన్లకు పెరిగాయి. జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) తాజా గణాంకాలను విడుదల చేసింది. చమురుయేతర ఎగుమతులు ఈ ఏడాది Q2తో పోలిస్తే SR8.4 బిలియన్లు ( 9.6%) తగ్గాయి. సెప్టెంబర్ 2021తో పోల్చితే 2022 సెప్టెంబర్‌లో సౌదీ అరేబియా మొత్తం సరుకుల ఎగుమతులు 30.9% పెరిగాయి. ఎగుమతుల విలువ సెప్టెంబర్ 2022లో SR124.7 బిలియన్లకు చేరుకుంది. ఇది సెప్టెంబర్ 2021లో SR95.2 బిలియన్ల నుండి పెరిగింది. ఈ పెరుగుదల ప్రధానంగా చమురు ఎగుమతుల నుండి వచ్చింది. సెప్టెంబరు 2021తో పోల్చితే చమురుయేతర ఎగుమతులు (పునః-ఎగుమతులు మినహా) 9.7% పెరిగాయి. సెప్టెంబర్ 2021లో SR19.7 బిలియన్ల నుండి SR21.6 బిలియన్లకు పెరిగింది. ఆగస్టు 2022తో పోలిస్తే చమురుయేతర ఎగుమతులు (పునః-ఎగుమతులతో సహా) తగ్గాయి. సెప్టెంబరు 2022లో సరుకుల దిగుమతులు 26.9% (SR 12.7 బిలియన్లు) పెరిగాయి. దిగుమతుల విలువ సెప్టెంబర్ 2021లో SR47.3 బిలియన్లతో పోలిస్తే 2022 సెప్టెంబర్‌లో SR60.0 బిలియన్లకు చేరుకుంది. దిగుమతులు కూడా ఆగస్ట్ 2022తో పోలిస్తే SR3.5 బిలియన్లకి తగ్గాయి. మూడవ త్రైమాసికం (Q3) 2022 అంతర్జాతీయ వాణిజ్య నివేదిక ప్రకారం.. Q3 2021తో పోలిస్తే Q3 2022లో మొత్తం సరుకుల ఎగుమతులు 46.1% పెరిగాయి. Q3 2022లో ఎగుమతుల విలువ SR273 నుండి SR399.7 బిలియన్లకు పెరిగింది. ఈ పెరుగుదల ప్రధానంగా చమురు ఎగుమతుల నుండి వచ్చింది. మొత్తం ఎగుమతులలో చమురు ఎగుమతుల వాటా Q3 2021లో 74.6% నుండి Q3 2022లో 80.4%కి పెరిగింది. Q2 2022తో పోలిస్తే, మొత్తం సరుకుల ఎగుమతులు SR30.8 బిలియన్లు లేదా 7.1% తగ్గాయి. Q3 2022లో సరుకుల దిగుమతులు 25.1% (SR36.4 బిలియన్లు) పెరిగాయి. దిగుమతుల విలువ Q3 2021లో SR144.8 బిలియన్లతో పోలిస్తే Q3 2022లో SR181.1 బిలియన్లకు చేరింది. Q2 SR 2022తో పోలిస్తే దిగుమతులు కూడా పెరిగాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







