గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన BCCI
- November 27, 2022
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 ఫైనల్ మ్యాచు గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ కు మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఆ మ్యాచుకు ఎన్నడూలేనంత మంది వచ్చారు. ఈ ఏడాది మే 29న జరిగిన ఆ మ్యాచుకు 1,01,566 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.
దీంతో బీసీసీఐకి గిన్నిస్ ప్రపంచ రికార్డు ప్రతినిధులు ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను తాజాగా అందించారు. ‘‘భారత్ గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించడం మనందరికీ గర్వకారణం. ఇది మన ఫ్యాన్స్ అందరికీ సంబంధించిన రికార్డు. వారి మద్దతు, క్రికెట్ పట్ల వారికి ఉన్న ప్యాషన్ కు దక్కిన గౌరవం. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్, ఐపీఎల్ కు శుభాకాంక్షలు’’ అని బీసీసీఐ పేర్కొంది.
‘‘1,01,566 మంది ప్రేక్షకులు హాజరైనందుకు గిన్నిస్ ప్రపంచ రికార్డు అందుకోవడాన్ని చాలా గర్వంగా భావిస్తున్నాను. క్రికెట్ అభిమానులకు ధన్యవాదాలు’’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు. కాగా, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్ద మైదానం. ఇందులో 1,32,000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు







